సీఎస్‌కేకు ‘రైనా’ షాక్ ఇవ్వనున్నాడా..?

by Shiva |   ( Updated:2021-03-17 09:52:23.0  )
సీఎస్‌కేకు ‘రైనా’ షాక్ ఇవ్వనున్నాడా..?
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. సీజన్ ప్రారంభానికి ముందే సురేష్ రైనా, హర్భజన్ సింగ్ జట్టు నుంచి తప్పుకున్నారు. వాళ్లను ఈ సీజన్‌ నుంచి తప్పస్తారని అందరూ భావించారు. కాగా, హర్బజన్ సింగ్‌ను విడుదల చేసిన సీఎస్కే సురేష్ రైనాను మాత్రం రిటైన్ చేసుకున్నది. కాగా, ఐపీఎల్ 14వ సీజన్ కోసం సీఎస్కే ఇప్పటికే శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. కెప్టెన్ ధోనీ సహా అందుబాటులో ఉన్న క్రికెటర్లు అందరూ చెన్నై చేపాక్ స్టేడియంలో సాధన చేస్తున్నారు. కాగా, సురేష్ రైనా మాత్రం ఈ రోజు రేపంటూ వాయిదాలు వేస్తున్నాడు.

తొలుత ఈ నెల 15నే జట్టుతో చేరతానని చెప్పిన సురేష్ రైనా.. తర్వాత మార్చి 21కి డేట్ మార్చాడు. తాజాగా తాను ఈ నెల 24 లోపు జట్టుతో చేరలేనని.. ఆ తర్వాతే ఎప్పుడు వచ్చేది ప్రకటిస్తానని సురేష్ రైనా మేనేజ్‌మెంట్‌తో చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘రైనా వ్యక్తిగత కారణాల వల్ల ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేక పోతున్నట్లు సమాచారం అందించాడు. ఈ నెల 24 తర్వాత కోచింగ్ క్యాంప్‌లో చేరతాడు’ అని సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story