మూవీ మొఘల్‌కు నివాళులర్పించిన సురేష్ బాబు

by Jakkula Samataha |
మూవీ మొఘల్‌కు నివాళులర్పించిన సురేష్ బాబు
X

దిశ, సినిమా: ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మూవీ మొఘల్ రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబుతో పాటు ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు విగ్రహానికి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత రామానాయుడని, ఈ రోజు ఫిల్మ్ నగర్ ఇలా ఉండటానికి ముఖ్య కారణం రామానాయుడు గారేనని ఫిల్మ్ నగర్ సెక్రెటరీ సత్యనారాయణ తెలిపారు. అయన సేవల వల్లే ఇవాళ చాలామందికి ఫిల్మ్ నగర్ జీవనాధారంగా నిలిచిందని కొనియాడారు.

Advertisement

Next Story