- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్ పోలీసులకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్ బీహెచ్ఈఎల్ లో ఉన్నతస్థాయి అధికారుల వేధింపులతో మహిళా ఉద్యోగిని ఆత్మహత్య కేసు విషయమై తెలంగాణ పోలీసులు, సీబీఐ అధికారులు, బీహెచ్ఎల్ యాజమాన్యానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సంస్థలో పై అధికారుల వేధింపులతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ ఉద్యోగిని సూసైడ్ నోట్ లో పేర్కొన్నది. తమ కూతురు మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. సూసైడ్ నోట్ లో ఆ ఉద్యోగిని పేర్కొన్న వారిని మియాపూరు పోలీసులు ఎందుకు విచారణ జరపలేదంటూ ఆగ్రహించింది. ఈ విషయమై నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా లేఖలో పేర్కొన్న ఉద్యోగులపై యాజమాన్యం ఏ చర్యలు తీసుకుందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయమై ఫిర్యాదు అందినా సీబీఐ ఎందుకు స్పందించలేదని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది.