- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘దుస్తుల మీది నుంచి తాకితే’ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: దుస్తుల మీది నుంచి బాలిక వక్ష స్థలాన్ని తాకితే లైంగిక వేధింపులుగా పరిగణించవద్దని చట్టం చెబుతోందని పేర్కొంటూ పోక్సో కేసు నుంచి ఓ నిందితుడిని విముక్తి చేసిన బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే హైకోర్టు తీర్పు విపరీత పరిణామాలకు దారితీయవచ్చని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆందోళనలు వ్యక్తపరచగా సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను వెలువరించింది. పోక్సో చట్టం కింద నిందితుడు బంధు రాంగ్డేను దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు తోసిపుచ్చుతూ బాలిక వక్ష స్థలాన్ని దుస్తుల మీది నుంచి తాకితే ఈ చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తెలిపింది.
నేరుగా ఆమె వక్షస్థలాన్ని తాకకుండా, అఘాయిత్యానికి పాల్పడాలన్న ఉద్దేశం లేకుంటే ఈ చట్టం కింద లైంగిక వేధింపుగా పేర్కొనలేమని నాగపూర్ బెంచ్ రూలింగ్ ఇచ్చింది. బాంబే హైకోర్టు ఆదేశాలపై నిరసనలు వ్యక్తమవడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏజీ వేణుగోపాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి అనుమతిస్తున్నట్టు సీజేఐ సారథ్యంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే తెలిపింది.