మాల్యా రివ్యూ పిటిషన్‌పై సుప్రీం విచారణ

by Shamantha N |
మాల్యా రివ్యూ పిటిషన్‌పై సుప్రీం విచారణ
X

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి 2017లో విజయ్ మాల్యా తన పిల్లలకు 40 బిలియన్ డాలర్లను బదిలీ చేయించుకున్నారు. ఈ విషయమై కోర్టు ధిక్కరణ కింద ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ విజయ్ మాల్యా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం విచారణ చేపట్టింది. కోర్టు రికార్డులకు సంబంధించి డాక్యూమెంట్స్ లేకపోవడంతో ఈ నెల 20కు కేసు వాయిదా పడింది. కోర్టు ధిక్కరణపై మూడేళ్ల క్రితమే విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఆ పిటిషన్ విచారణకు రాలేదు. మాల్యా పిటిషన్ ఎందుకు లీస్ట్ కాలేదో వివరణ ఇవ్వాలని జూన్‌లో రిజిస్ట్రీని సుప్రీంకోర్టు కోరింది.

ఈ అలసత్వానికి కారణమైన అధికారుల పేర్లతో సహా వివరాలను సమర్పించాలని ఆదేశించింది. 2017లో బ్రిటిష్ వ్యాపార సంస్థ డైజియో నుంచి 40 మిలియన్ డాలర్లను తన పిల్లల ఖాతాలకు విజయ్ మాల్యా బదిలీ చేయించుకున్నారు. ఈ విషయమై ఎస్‌బీఐతో కూడిన బ్యాంకు కన్సార్టియం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 2017, 9న విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా తేల్చింది. ఈ తీర్పుపై రివ్యూ కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Next Story