ఆ 50 కోట్లు ఇప్పుడే పంచొద్దు: సుప్రీంకోర్టు

by srinivas |   ( Updated:2020-06-26 10:45:42.0  )
supreme court notices to twitter
X

దిశ ఏపీ బ్యూరో: వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో సంభవించిన స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషన్‌కు సంబంధించి అదనపు పత్రాలను సమర్పించేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు కోర్టు అనుమతించింది. అంతేకాకుండా, దుర్ఘటన అనంతరం ఎన్‌జీటీ ఆదేశించిన విధంగా ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన 50 కోట్ల రూపాయలను ఇప్పుడే పంపిణీ చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గతంలో ఈ ప్రమాదంపై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్లను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ 50 కోట్ల రూపాయల పంపిణీపై మధ్యంతర స్టే కొనసాగుతుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed