గొగోయ్‌ను విచారించాలన్న పిటిషన్ డిస్మిస్

by Shamantha N |
గొగోయ్‌ను విచారించాలన్న పిటిషన్ డిస్మిస్
X

దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను విచారించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గొగోయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, 2016 జులైలో వెలువరించిన ఓ తీర్పులో జస్టిస్ రంజన్ గొగోయ్ పక్షపాత ధోరణి కనబరిచారని పిటిషన్ ఆరోపించింది.

దీనిపై అంతర్గత విచారణ జరిపించాలని 2018లో ఈ పిటిషన్ దాఖలైంది. కాగా, జస్టిస్ గొగోయ్ రిటైర్ అయ్యారని, ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణ అనవసరమని పేర్కొంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనేకసార్లు రిజిస్ట్రీకి రిమైండర్ లెటర్లు పంపించినా పిటషన్‌ను లిస్ట్ చేయలేదని పిటిషనర్ వాదించారు.

Advertisement

Next Story