- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాటిపై మీ అభిప్రాయం చెప్పండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతులకు అందజేసే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని పెంచే విషయమై అన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 1992లో వెల్లడించిన ఇంద్ర సాహ్నీ కేసు తీర్పులో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పున:పరిశీలన చేయవలసిన అవసరం ఉందా..? అనే దానిపై సుప్రీంకోర్టు సమీక్షించనుంది. ఈ మేరకు రాష్ట్రాలు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి వారి అభిప్రాయాలను సేకరించాలని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. మహారాష్ట్రలో మరాఠాలకు ప్రతిపాదించిన రిజర్వేషన్లకు సంబంధించిన కేసు విచారణపై స్పందిస్తూ కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తే అది ఓబీసీ కోటా మీద ఏదైనా ప్రభావం చూపనుందా..? అనేదానిమీద ధర్మాసనం సమీక్షించనుంది. తమిళనాడు, మహారాష్ట్రలో రిజర్వేషన్ల మీద 50 శాతం పరిమితిని కాదని అంతకుమించే అందజేస్తున్న విషయం తెలిసిందే.