ఓటుకు నోటు కేసులో చంద్రబాబును చేర్చుతారా.?

by Anukaran |   ( Updated:2020-12-17 05:59:55.0  )
ఓటుకు నోటు కేసులో చంద్రబాబును చేర్చుతారా.?
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌ను వచ్చే ఏడాది జూలైలో‌ విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేసవి సెలవులు ముగియగానే విచారణ చేస్తామని తెలిపింది. కోర్టు నిర్ణయంతో.. ఖచ్చితమైన విచారణ తేదీని ప్రకటించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరారు. తమ లిఖిత పూర్వక ఆదేశాల్లో ఇస్తామని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్‌ కూడా స్పష్టం చేశారు.

గతంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబును చేర్చాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేస్తుంది. పిటిషనర్‌ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టులో వాదించిన ప్రశాంత్ భూషన్‌ ఓటుకు నోటు కేసులో కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందన్నారు. కానీ ఏసీబీ ఆయన పేరు చేర్చడం లేదని ఆరోపించారు. అందుకే కేసును త్వరితగతిన చేపట్టాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. ఇందుకోసం ఓటుకు కోట్లు కేసు ఛార్జ్ షీట్లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించినప్పటికీ.. అయినా ఆ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని పిటిషన్లో వెల్లడించారు. ఓటుకు కోట్లు కేసుపై చంద్రబాబు పేరును చేర్చి వెంటనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed