డాక్టర్ల డ్యాన్స్ వీడియోపై ‘లవ్ జిహాదీ’ కాంట్రవర్సీ..

by Shyam |   ( Updated:2021-04-12 03:56:02.0  )
డాక్టర్ల డ్యాన్స్ వీడియోపై ‘లవ్ జిహాదీ’ కాంట్రవర్సీ..
X

దిశ, ఫీచర్స్ : త్రిస్సూర్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన జానకి ఓం కుమార్‌, నవీన్‌ కె రజాక్‌ అనే ఇద్దరు వైద్య విద్యార్థులు కలిసి చేసిన డ్యాన్స్‌ వీడియో.. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. బోనీ ఎం గ్రూప్‌కు చెందిన రాస్‌పూటిన్‌ సాంగ్‌కు వీరిద్దరూ అద్భుతంగా స్టెప్పులేశారు. తమ కాలేజీ కారిడార్‌లో షూట్ చేసిన ఈ వీడియోలో వీరు కాలేజ్ యూనిఫామ్స్‌లోనే కనిపించారు. సూపర్బ్ ఫుట్‌వర్క్, అమేజింగ్ గ్రేస్‌, గుడ్ కోఆర్డినేషన్‌తో వాళ్లిద్దరు చేసిన డ్యాన్స్‌కు నెట్టింట్లో ప్రశంసలు కురుస్తుండగా.. మరొపక్క ఈ డ్యాన్స్ డ్యుయో అనుకోని కాంట్రవర్సీకి కేంద్రంగా మారింది.

జానకి మెడిసిన్‌ మూడో సంవ్సతరం విద్యార్థిని కాగా, నవీన్‌ కె రజాక్‌ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్. వీళ్లు డ్యాన్స్ చేసిన విధానంతో పాటు ఎంచుకున్న సాంగ్‌కు ఏమాత్రం వంక పెట్టడానికి వీల్లేదు. కానీ ఆ యువకుని పేరే మతపరమైన కాంట్రవర్సీకి దారితీసింది. కొన్ని రోజులుగా లవ్ జిహాద్, ఐసిస్ వంటి ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఒకవైపు ట్రోల్ దాడి కొనసాగుతుండగా, వీరిద్దరికి సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభిస్తోంది. ఐఎంఎ మెడికల్ స్టూడెంట్స్ నెట్‌వర్క్ కూడా జానకి ఓంకుమార్, రజాక్‌లకు మద్దతు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘మెడికల్ కాలేజీ క్యాంపస్‌లు మనిషి సృష్టించిన కుల, మత, లింగభేదాలన్నీ అసంబద్ధమయ్యే ప్రదేశాలు. మనం మనుషుల్లా ప్రవర్తించాలి, సంభాషించాలి, ఆలోచించాలని ఇది గుర్తు చేస్తోంది. వీరిద్దరితో పాటు రాబోయేవారికి మా సంఘీభావం’ అని అందులో పేర్కొంది.

కాగా ఈ ట్రోల్స్‌ను చాలెంజ్‌గా తీసుకున్న త్రిస్సూర్ వైద్య విద్యార్థులతో పాటు మరికొంతమంది వారిద్దరికీ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ట్రోల్స్‌కు నిరసనగా రాస్‌పుటిన్‌ సాంగ్‌కు నృత్యం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతోపాటు డ్యాన్స్ డ్యుయోపై దుర్మార్గపు ట్రోల్ దాడిని ప్రారంభించిన న్యాయవాది కృష్ణ రాజ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేరళవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. అయితే తాము ట్రోల్స్‌ను పట్టించుకోవడం లేదంటున్న ఆ వైద్య విద్యార్థులు.. తాము మళ్లీ కలిసి నృత్యం చేశామని వెల్లడించడంతో పాటు సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

విభిన్న మతాల కారణంగా ఈ పిల్లలపై హిందూత్వ విషాన్ని చిమ్మడానికి బదులు.. వారిని చప్పట్లతో ప్రోత్సహించాలి. యంగ్ ఇండియాలో అత్యుత్తమమైన టాలెంట్ & కామ్రేడ్‌షిప్‌‌కు ప్రతిబింబాలైన వీరిని ఏదోఒకరోజు సానుభూతిపరులైన వైద్యులుగా మనం చూస్తాం’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. జానకి, నవీన్‌కు మద్దతుగా డ్యాన్స్ చేసిన వీడియోలు చూసిన శశి థరూర్ ‘ఇది మరింత బెటర్‌మెంట్! ఇప్పుడు అదే కళాశాలలో అరడజను మంది ఇతర వైద్య విద్యార్థులు వారికి మద్దతుగా నృత్యం చేయడానికి వచ్చారు’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ నిరసనల నేపథ్యంలో ‘రెస్పెక్ట్, అప్లాజ్, డ్యాన్స్ఈజ్‌నాట్‌జిహాద్’ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

Next Story