రజనీ పార్టీ పేరు ఇదేనా..?

by Anukaran |   ( Updated:2020-12-14 23:37:24.0  )
రజనీ పార్టీ పేరు ఇదేనా..?
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీ పార్టీ పేరు, గుర్తు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రజనీ వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెల చివరి నాటి పార్టీ విధివిధానాల్ని ప్రకటిస్తామన్నారు. తాజాగా రజనీ పార్టీ పేరు, గుర్తుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొద్దిరోజుల క్రితం పోయెస్ గార్డెన్ లో జరిగిన మీడియా సమావేశంలో రజనీ మాట్లాడుతూ.., మనం పార్టీ పెట్టబోతున్నాం. 2021న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. తప్పకుండా గెలుస్తాం. అవినీతిలేని స్వచ్ఛమైన, ఆధ్యాత్మిక విలువలతో కూడిన రాజకీయాలకు బాటలు వేద్దాం. ఈ పోరాటంలో నా ప్రాణాలు కోల్పోయినా నాకు సంతోషమే. కానీ… వెనకడుగు మాత్రం వేయనంటూ హామీ ఇచ్చారు. అంతేకాదు త్వరలో పార్టీ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రజనీ పార్టీ గుర్తు ” సైకిల్ ” అంటూ వార్తలు వచ్చాయి. కేంద్రం ఎన్నికల సంఘం వద్ద సైకిల్ గుర్తులేదని, బాబా గుర్తును ఎంపిక చేసుకుంటే బాగుంటుదన్న అభిప్రాయాన్ని రజనీ సన్నిహితులు ఆయనకు చెప్పినట్లు వార్తల సారాశం

మరోసారి తలైవా పార్టీ పేరు, గుర్తు ఇదేనంటూ మరోవార్త ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిగ్గా మారింది. పార్టీ పేరు “మక్కళ్ సేవై కట్చి” (తెలుగులో ప్రజాసేవ పార్టీ) అని పార్టీకి “ఆటో” గుర్తును కేటాయించినట్లు తెలుస్తోంది. పెద్దవాళ్లైనా, చిన్నవాళ్లైనా ఆటో అంటే గుర్తొచ్చేది భాషా సినిమాలో రజనీ కాంత్ ఆటో డ్రైవర్ కేరక్టర్. అంతలా గుర్తింపు తెచ్చిన ఆటో గుర్తును ఎన్నికల సంఘం రజనీ పార్టీ గుర్తుగా ప్రకటిస్తున్నట్లు తెలియడంతో సన్నిహితులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా రజనీ ప్రస్తుతం రామోజీ ఫిల్మిం సిటీలో ’అన్నాత్తే’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఓ వైపు షూటింగ్ ల తో బిజీగా ఉన్న మరోవైపు పార్టీ స్థాపనకు సన్నాహాలు వేగంగా చేస్తున్నారు.

Advertisement

Next Story