టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్… మెగాఫోన్ పట్టనున్న స్టార్ డాటర్

by Shyam |   ( Updated:2021-10-02 05:30:16.0  )
Aishwarya
X

దిశ, సినిమా: తమిళ్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. మరోసారి టాలీవుడ్‌లో తన మార్క్ చూపించబోతుంది. ఈ మేరకు లైకా ప్రొడెక్షన్స్‌ తెరకెక్కించనున్న ఓ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అయితే ఇప్పటికే ఆ సంస్థ ‘రామ్‌సేతు’, ‘గుడ్‌లక్‌ జర్రీ’ సినిమాలను నిర్మిస్తుండగా.. మరో ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాన్ని తాజాగా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘లైకా ప్రొడెక్షన్స్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మీ ముందుకు తీసుకురానున్నాం’ అని తెలిపారు. ఇక ఇప్పటికే ‘3’తో దర్శకురాలిగా మంచి మార్కులు కొట్టేశారు ఐశ్వర్య.. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కబోతున్నందుకు రజనీ, ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Advertisement

Next Story