పాలమూరులో రూ. 300 కోట్లతో హాస్పిటల్: శ్రీనివాస్‌ గౌడ్

by Shyam |
పాలమూరులో రూ. 300 కోట్లతో హాస్పిటల్: శ్రీనివాస్‌ గౌడ్
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనం స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, తదితరులతో కలిసి ఆయన కలెక్టరేట్‌ను సందర్శించి.. భవనం దెబ్బతిన్న భాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ నడిబొడ్డున, అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూ. 250 నుంచి 300 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలు సులభంగా ఆస్పత్రికి చేరుకొని మెరుగైన వైద్యసేవలు పొందేందుకు.. ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారని స్పష్టం చేశారు. కలెక్టరేట్ పరిపాలన నూతన భవనంలోకి మార్చిన తర్వాత.. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నింటినీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందజేస్తామని మంత్రి వివరించారు. దీంతో రజాకార్ల సమయంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం త్వరలోనే నేలమట్టం కానుంది.

Advertisement

Next Story

Most Viewed