విడాకులా.. చైతును కన్విన్స్ చెయ్ : సామ్

by Shyam |
విడాకులా.. చైతును కన్విన్స్ చెయ్ : సామ్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య, సమంత జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లిద్దరూ కలిసున్న ఫొటో సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్‌గానే ఉంటుంది. కానీ సమంతను ఏమాయ చేశావే సినిమా నుంచి ఫాలో అయిన కొందరు ఫ్యాన్స్ మాత్రం.. ఇంకా సామ్ మీద ఆశలు పెట్టుకున్నట్టున్నారు. సామ్ లేటెస్ట్‌గా ‘ఫీలింగ్ గుడ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టకు వచ్చిన రిక్వెస్టే ఇందుకు ఉదాహరణ. వైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ, నవ్వుతున్న సామ్‌ను చూసిన ఓ నెటిజన్.. ‘సామ్.. చైతుకు విడాకులిచ్చేయ్, మనిద్దరం పెళ్లి చేసుకుందాం’ అని సవినయంగా అడిగాడు. కాగా ఫ్యాన్ రిక్వెస్ట్‌కు ‘కష్టం.. ఒక పని చెయ్.. చైతుని అడుగు’ అంటూ డీసెంట్ రిప్లయ్ ఇచ్చింది సామ్. దీనికి ఫ్యాన్ సరే అడుగుతా అని సమాధానం ఇచ్చాడు. ఈ కన్వర్జేషన్ ఆకట్టుకోగా, చంపేశారుగా మేడమ్.. భలే రిప్లయ్ ఇచ్చారంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed