SRH దెబ్బకు ముంబై విలవిల

by Anukaran |   ( Updated:2020-11-03 12:25:06.0  )
SRH దెబ్బకు ముంబై విలవిల
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 56వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. ఓపెనర్ల ధాటికి ముంబై బౌలర్లు తోకమూడిచారు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు.. డేవిడ్ వార్నర్(85), వృద్ధిమాన్ సాహ(58) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో ఒక్క వికెట్ కోల్పోకుండా హైదరాబాద్ జట్టు 17.1ఓవర్లలోనే 151 పరుగులు చేసింది. దీంతో ఈ సీజన్‌లో తొలిసారిగా ముంబై ఇండియన్స్ పై 10 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది.

ఓపెనర్లు ముంబైని బెదరగొట్టారు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ఒకరికి ఒకరు పోటీ పడుతూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీపర్ వృద్ధిమాన్ తొలి నుంచి సమిష్టిగా రాణించారు. మొత్తం 58 బంతులు ఆడిన డేవిడ్ వార్నర్ 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 85 పరుగులు చేశాడు. ఇక వృద్ధిమాన్ సాహ కూడా ఏ మాత్రం తీసిపోకుండా 45 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి 58 పరుగులు చేశాడు. వీరిద్దరు కూడా తమ వికెట్‌ కోల్పోకుండా సమిష్టిగా రాణిస్తూ ముంబై జట్టు పై ఘన విజయం సాధించేలా కృషి చేశారు.

ముంబై ఇన్నింగ్స్:

ఐపీఎల్ 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యావరేజ్ స్కోరు నమోదు చేసింది. టాస్‌ ఒడి బ్యాటింగ్‌‌కు దిగిన రోహిత్ సేన పరుగులు తీయడంలో కాస్త తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులకే పరిమితం అయింది. ముఖ్యంగా హైదరాబాద్ పేస్ బౌలర్ సందీప్ శర్మ కీలక సమయంలో 3 వికెట్లు తీసుకొని స్కోరును కట్టడి చేశాడు. ముంబై తరఫున ఓపెనింగ్ దిగిన రోహిత్ శర్మ (4) పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్వింటన్ డీకాక్ (25) పరుగులు చేసి స్కోర్ బోర్డు 39 వద్ద సందీప్ శర్మ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (36), ఇషాన్ కిషన్ (33) పరుగులతో రాణించారు. కానీ, కృనాల్ పాండ్యా(0) మాత్రం డకౌట్ అయ్యాడు. సౌరబ్ తివారి కూడా ఒక పరుగు చేసి బ్యాట్ వదిలాడు. 36 పరుగులతో రాణిస్తున్న ఇషాన్ కిషన్‌ 115 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 6 వికెట్లు కోల్పోయింది.

ఇక ఆ తర్వాత వచ్చిన ఆల్ ‌రౌండర్ పొలార్డ్ 25 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టి 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, చివరి ఓవర్‌లో జాసన్ హోల్డర్ వేసిన బంతికి క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నాథన్ కౌల్టర్ నైల్ 1 పరుగు చేసి వెనుదిరిగాడు. ఇక చివర్లో వచ్చిన జేమ్స్ ప్యాటిన్సన్ (4), ధావల్ కుల్‌కర్ని (3) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు పూర్తియ్యే సరికి ముంబై ఇండియన్స్ 8 వికెట్లను కోల్పోయి 149 పరుగులు చేసింది.

ప్లే ఆఫ్స్ చేరిన జట్లు:

ఇక ఈ మ్యాచ్‌ ఘన విజయంతో ప్లే ఆఫ్స్‌‌కు హైదరాబాద్‌ అర్హత సాధించింది. ఇప్పటివరకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరగా.. తాజాగా ఈ మ్యాచ్‌ విజయంతో హైదరాబాద్ కూడా చేరిపోయింది. దీంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. నవంబర్ 5న క్వాలిఫయర్ -1 మ్యాచ్‌లో ముంబై-ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. 6వ తేదిన బెంగళూరు-హైదరాబాద్ జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి.

స్కోర్‌ బోర్డ్:

Mumbai Indians Innings: 149-8 (20 Ov)

1. రోహిత్ శర్మ (c)c వార్నర్ b సందీప్ శర్మ 4(7)
2. క్వింటన్ డీకాక్ (wk)b సందీప్ శర్మ 25(13)
3. సూర్య కుమార్ యాదవ్ C వృద్ధిమాన్ సాహ b నదీమ్ 36(29)
4. ఇషాన్ కిషన్ b సందీప్ శర్మ 33(30)
5. కృనాల్ పాండ్యా c విలియమ్సన్ b నదీమ్ 0(3)
6. సౌరబ్ తివారి c వృద్ధిమాన్ సాహ b రషీద్ ఖాన్ 1(3)
7. కీరన్ పొలార్డ్ b హోల్టర్ 41(25)
8. నాథన్ కౌల్టర్ నైల్ c ప్రియమ్ గార్గ్ b హోల్డర్ 1(3)
9. జేమ్స్ ప్యాటిన్సన్ నాటౌట్ 4(5)
10.ధావల్ కుల్‌కర్ని నాటౌట్ 3(2)

ఎక్స్‌ట్రాలు: 1

మొత్తం స్కోరు: 149-8

వికెట్ల పతనం: 12-1 (రోహిత్ శర్మ, 2.3), 39-2 (క్వింటన్ డీకాక్, 4.4), 81-3 (సూర్యకుమార్ యాదవ్, 11.1), 81-4 (కృనాల్ పాండ్యా, 11.4), 82-5 (సౌరబ్ తివారి, 12.1) 115-6 (ఇషాన్ కిషన్, 16.3), 116-7 (కౌల్టర్ నైల్, 17.2), 145-8 (పొలార్డ్, 19.3).

బౌలింగ్:
1. సందీప్ శర్మ 4-0-34-3
2. జాసన్ హోల్డర్ 4-0-25-2
3. షాబాజ్ నదీమ్ 4-0-19-2
4. టి. నటరాజన్ 4-0-38-0
5. రషీద్ ఖాన్ 4-0-32-1
Sunrisers Hyderabad Innings:
1. డేవిడ్ వార్నర్ (c) నాటౌట్ 85(58)
2. వృద్ధిమాన్ సాహ (wk) నాటౌట్ 58(45)

ఎక్స్‌ట్రాలు: 8

మొత్తం స్కోరు: 151-0

వికెట్ల పతనం: —-

బౌలింగ్:
1. ధావల్ కులకర్ని 3-0-22-0
2. నాథన్ కౌల్టర్ నైల్ 4-0-27-0
3. జేమ్స్ ప్యాటిన్సన్ 3-0-29-0
4. రాహుల్ చాహర్ 4-0-36-0
5. కృనాల్ పాండ్యా 3.1-0-37-0

Advertisement

Next Story

Most Viewed