యూఏఈలో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్

by Anukaran |   ( Updated:2020-08-23 05:14:55.0  )
యూఏఈలో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పాల్గొనడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు యూఏఈలో అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం జట్టు యూఏఈ చేరుకున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నది. విమానాశ్రయంలో అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న అనంతరం దుబాయ్ లోని రిట్జ్ కార్ల్‌టన్ హోటల్‌కు చేరుకున్నారు.

భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహతో పాటు అందరు ఆటగాళ్లు ముఖాలకు షిల్డ్స్, మాస్కులు ధరించి అత్యంత భద్రంగా తమకు కేటాయించిన రూములకు వెళ్లారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్ కారణంగా కెప్టెన్ వార్నర్, జోనాతాన్ బారిస్ట్రో ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. అలాగే కేన్ విలియమ్‌సన్ నేరుగా న్యూజిలాండ్ నుంచి దుబాయ్ చేరుకోనున్నట్లు సమాచారం. మూడు వారాల పాటు బయో సెక్యూర్ వాతావరణంలో జట్టు ప్రాక్టీస్ చేయనుంది. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, బీసీసీఐ (BCCI) ఇంకా పూర్తి షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది.

Advertisement

Next Story