సన్‌రైజర్స్ స్కోర్ 158/4

by Anukaran |
సన్‌రైజర్స్ స్కోర్ 158/4
X

దిశ, వెబ్‌డెస్క్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్వాలేదనిపించింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(48) పరుగులతో రాణించాడు. ఇక బెయిర్‌ స్టో ఈ రోజు మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కేవలం 16 పరుగులకే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే(54) పరుగులు చేసి స్కోరు బోర్డును ముందుకుతీసుకెళ్లాడు. కేన్ విలియమ్సన్(22*), ప్రియమ్ గార్గ్(15) పరుగులతో సరిపెట్టుకున్నారు. దీంతో సన్‌రైజర్స్ 158 పరుగులు చేయగలిగింది.

Advertisement

Next Story