- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అబ్బా సాయిరాం.. మా 'కావ్య మారన్' పాప నవ్వింది'
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2021 మంచి రసవత్తరంగా సాగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో అనుకోని టీమ్స్ విజయాన్ని అందుకొంటున్నాయి. ఇక వరుస పరాజయాలను చవిచూస్తున్న సన్ రైజర్స్ ఎట్టకేలకు మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. చెన్నై చెపాక్ వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం అంచులకు వరకు వెళ్ళి వరుస ఓటములను ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో సూపర్ విక్టరీ కొట్టింది.ఈ విజయంతో సన్ రైజర్స్ ఆటగాళ్లు అభిమానులకు బూస్ట్ ఇచ్చారు. ఇకపోతే ఈ విజయం నెట్టింట వైరల్ గా మారింది. గత మూడు మ్యాచ్ లు ఓటమి పాలవ్వడంతో సన్ రైజర్స్ యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది.
https://www.instagram.com/p/CN9Mf-EpOKk/
ముఖ్యంగా జట్టు అనుహ్య ఓటములతో నిరాశలో మునిగిపోయిన కావ్య మారన్‌పై సెటైర్లు వేశారు. ఇప్పటివరకు కావ్య డల్ గా ఉన్న ఫేస్ పై మీమ్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. ఇక ఈ గెలుపు తో కావ్య నవ్వడంతో ఆ మీమ్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ‘హమ్మయ్య.. పాప నవ్వింది రోయ్’,.. ‘అబ్బా సాయిరాం.. మా ‘కావ్య మారన్’ పాప నవ్వింది’..’ తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు’ అంటూ మీమ్స్ లో కావ్య మారన్ ని ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ అందరిని నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి.