- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టాస్ గెలిచిన SRH మ్యాచ్ గెలుస్తుందా?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 13వ సీజన్‌లో 56వ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ పైనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటికే 9 మ్యాచుల్లో విజయం సాధించి.. 18 పాయింట్లు, +1.296 నెట్ రన్ రేట్‌తో ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన ముంబై ఇండియన్స్ వంటి టఫ్ టీమ్‌తో హైదరాబాద్ జట్టు పోటీపడనుంది. ఇక మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. లేని పక్షంలో నెట్ రన్ రేట్ తలకిందులు అయితే వెనుదిరగాల్సిందే అంటూ క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
జట్ల బలాబలాలు:
ముంబై జట్టు ఆటగాళ్లు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నారు. టాప్ ఆర్డర్ విఫలం అయిన సమయంలో మిడిలార్డర్లు రాణిస్తున్నారు. దీనికి తోడు అధ్బుతమైన బౌలర్లు ఫామ్‌లో ఉండటం ముంబై ఇండియన్స్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. కాగా, ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరడంతో కొత్త ఆటగాళ్లను ఆడించే అవకాశం ఉండొచ్చని సీనియర్ క్రికెటర్ లారా చెప్పాడు.
ఇక హైదరాబాద్ విషయానికొస్తే అభిమానులు కాసింత ఆందోళన చెందుతున్నారు. టాప్ ఆర్డర్ విఫలమైతే మిడిలార్డర్ జట్టును చాలా టెన్షన్ పెడుతోంది. కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఫామ్ లేకపోవడం జట్టుకు బలహీనంగా మారింది. కానీ, ఇదే మ్యాచులో హైదరాబాద్ ఆటగాళ్లు సత్తా చాటితే తప్పకుండా విజయం వరిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.