- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకు ఈ స్పాన్సర్లు చాలు : సన్‌రైజర్స్
దిశ, స్పోర్ట్స్: ఒకవైపు బీసీసీఐ సహా ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ స్పాన్సర్ల కోసం వెతుకుతుంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం మాకు ఈ స్పాన్సర్లు చాలు అని అంటున్నది. 2016 ఛాంపియన్స్ అయిన సన్‌రైజర్స్ జట్టు ప్రముఖ మీడియా సంస్థ సన్ నెట్‌వర్క్ గ్రూప్‌కు చెందినది. ఈ ఏడాది జనవరిలో జేకే లక్ష్మీ సిమెంట్స్ లిమిటెడ్‌తో జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడటంతో ఆ ఒప్పందం అమలులోనికి రాలేదు.
2020 ఐపీఎల్ సీజన్‌ను యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించడంతో జేకే లక్ష్మీ సిమెంట్ తమ ఒప్పందాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చింది. అంతే కాకుండా రాల్కో టైర్స్, వాల్వోలైన్ సంస్థలు కూడా స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇక జట్టు స్పాన్సర్లుగా జియో, టీసీఎల్, జైరాజ్ స్టీల్, నెరోలాక్, కోల్గేట్ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి. జట్టు కిట్‌ను టైకా, ఫ్యాన్‌కోడ్, ఐబీ క్రికెట్, డబుల్ హార్స్ సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి.
దీంతో తమకు ప్రస్తుతం ఉన్న స్పాన్సర్లు చాలని, కొత్తగా ఎవరితోనూ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదని ఎస్ఆర్‌హెచ్ సీఈవో కే. శణ్ముగం స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఎలాగైనా టైటిల్ సాధించాలని ఆటగాళ్లు చాలా కష్టపడుతున్నారని, ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఉత్సహంతో ఎదురు చూస్తున్నామని ఆయన వెల్లడించారు.