- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SRH చేతిలో రాజస్థాన్ చిత్తు..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు తొలుత తడబడినా.. ఎట్టకేలకు నిలబడింది. SRH జట్టులో ఓపెనర్లు విఫలమైనా మనీష్ పాండే 83(47), విజయ్ శంకర్ 52(51)లు తమదైన ఇన్సింగ్ ఆడి జట్టుకు భారీ విజయాన్ని అందించారు. సమయం దొరికినపుడల్లా ఫోర్లు, సిక్సులతో RR బౌలర్లపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా మనీష్ పాండే ఈ టోర్నీలో అద్భుత ఆటతీరును కనబరిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో 156(18.1) ఓవర్లలోనే సన్ రైజర్స్ జట్టు భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్ :
ఐపీఎల్ 40వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదిలోనే తడబడింది. RR బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి మూడు ఓవర్లలోపే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 4(1), జానీ బెయిర్ స్టో 10(7) వెనువెంటనే వికెట్లు సమర్పించుకున్నారు.
ఆ తర్వాత మూడో డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మనీష్ పాండే తనదైన ప్రదర్శన చేశాడు. తను బ్యాటింగ్ దిగే సమయానికి 16-2(2.4) ఉన్న స్కోరును తక్కువ సమయంలో పెంచేందుకు ప్రయత్నించాడు. కష్టాల్లో ఉన్న జట్టుకు అండగా నిలబడి వచ్చిన బంతిని వచ్చినట్లే ఆడుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక సమయంలో ఫోర్లు, సిక్సులతో రాజస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. దీంతో 50(28) బంతుల్లోనే అద్భుతంగా తన హాఫ్ సెంచరినీ పూర్తి చేసుకున్నాడు. మనీష్ సాధించిన మొత్తం పరుగుల్లో సింగిల్స్, ఫోర్ల కంటే, సిక్సులు (8) అధికంగా ఉండటం విశేషం.
అనంతరం మనీష్ పాండేతో పాటు విజయ్ శంకర్ కూడా తన దూకుడును పెంచాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే ఆడుతూ.. మధ్యమధ్యలో బౌండరీలకు మలిచాడు. ఈ క్రమంలోనే జోఫ్రాఅర్చర్ బౌలింగ్‌లో హాట్రిక్ ఫోర్లు బాదిన విజయ్ శంకర్ 52(51) సులువుగా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి దెబ్బకు రాజస్థాన్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో కేవలం 2 వికెట్ల నష్టానికి సన్ రైజర్స్ జట్టు 156(18.1)ఓవర్లలోనే లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది.
స్కోరు బోర్డు :
Sunrisers hyderabad Innings :
డేవిడ్ వార్నర్ 4(4) c స్టోక్స్ b జోఫ్రా అర్చర్, జానీ బెయిర్ స్టో 10(7) b జోఫ్రా అర్చర్, మనీష్ పాండే 83(47) నాటౌట్, విజయ శంకర్ 52(51) నాటౌట్
ఎక్స్‌ట్రాలు : 7 – మొత్తం స్కోరు : 156/2
వికెట్ల పతనం : 4-1( డేవిడ్ వార్నర్, 0.4), 16-2 (జానీ బెయిర్ స్టో, 2.4) 00-3 (, 12.1), 000-4 (, 15.3), 000-5 (, 18.1), 000-6 ( ,18.2)
బౌలింగ్ : జోఫ్రా అర్చర్ 4-0-21-2, అంకిత్ రాజ్ పుత్ 1-0-11-0,
కార్తీక్ త్యాగి 3.1-0-42-0, బెన్ స్టోక్స్ 2-0-24-0, శ్రేయాస్ గోపాల్ 4-0-32-0, రాహుల్ తెవాటియా 4-0-25- 0
Rajasthan Royals Innings :
రాబిన్ ఉతప్ప 19(13) r అండ్ b జేసన్ హోల్దర్, సంజూ శ్యాంసన్ 36(26) b జాసన్ హౌల్డర్, బెన్ స్టోక్స్ 30(32) b రషీద్ ఖాన్, జాస్ బట్లర్ 9(12) c నదీమ్ b విజయ్ శంకర్, స్టీవ్‌స్మిత్ 19(15) c మనీష్ పాండే b జాసన్ హోల్డర్, రియాన్ ప్రాగ్ 20(12) c డేవిడ్ వార్నర్ b జాసన్ హోల్డర్
ఎక్స్‌ట్రాలు : 3 – మొత్తం స్కోరు : 154/2
వికెట్ల పతనం : 30-1 (రాబిన్ ఉతప్ప, 3.3), 86-2 (సంజూ శ్యాంసన్, 11.4) 86-3 (బెన్ స్టోక్స్, 12.1), 110-4 (జాస్ బట్లర్, 15.3), 134-5 (స్టీవ్ స్మిత్, 18.1), 135-6 ( రియాన్ ప్రాగ్,18.2)
బౌలింగ్ : సందీప్ శర్మ 4-0-31-0, జాసన్ హోల్దర్ 4-0-33-3,
విజయ్ శంకర్ 3-0-15-1, టి. నటరాజన్ 4-0-46-0, రషిద్ ఖాన్ 4-0-20-1, షాబాజ్ నదీమ్ 1-0-9-0