ఎయిర్‌పోర్టులో పరుగులు పెట్టిన సన్నీలియోన్.. వీడియో వైరల్

by Shyam |   ( Updated:2023-06-13 15:15:50.0  )
ఎయిర్‌పోర్టులో పరుగులు పెట్టిన సన్నీలియోన్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పరుగులుపెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోను మీడియా ఫొటోగ్రాఫర్ తన్ అకౌంట్‌లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సన్నీ.. సెక్యూరిటీ క్లియరెన్స్ పొందే క్రమంలో అక్కడున్న ఫొటోగ్రాఫర్లకు పోజిచ్చింది. ఇంతలోనే వెళ్లేందుకు పర్మిషన్ రావడంతో తన సిబ్బందితో కలిసి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో అక్కడున్న డిస్‌ప్లే బోర్డులోనూ ‘లేట్’ అని కనిపిస్తుండటం వీడియోలో చూడొచ్చు. కాగా ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చూసిన నెటిజన్లు.. ఫ్లైట్ క్యాచ్ చేసే క్రమంలో తమకు కూడా ఇలా జరిగిందని, సన్నీ కూడా అందుకే పరుగెత్తిందని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇస్తుండే సన్నీ.. తాజాగా తన సిబ్బందిలో ఒకరి చేతిపై జలగను వేసి వారి ధైర్యాన్ని పరీక్షించిన వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story