విక్కీ, కత్రినా ఎంగేజ్మెంట్.. ఆ రోజు ఏం జరిగిందంటే..

by Shyam |   ( Updated:2021-09-11 03:05:01.0  )
విక్కీ, కత్రినా ఎంగేజ్మెంట్.. ఆ రోజు ఏం జరిగిందంటే..
X

దిశ, సినిమా : బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని, త్వరలోనే మ్యారేజ్ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇదంతా రూమర్ అని తెలియడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. కాగా ఈ విషయంపై స్పందించిన విక్కీ బ్రదర్ సన్నీ కౌశల్.. ఈ ఫేక్ న్యూస్ బయటకొచ్చిన రోజు ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమర్ విన్న వెంటనే ఫ్యామిలీ మొత్తం పగలబడి నవ్వేశారని తెలిపాడు. ఈ న్యూస్ వినేముందు విక్కీ ఆల్రెడీ జిమ్‌కు వెళ్లిపోయాడని, తను వచ్చిన వెంటనే కత్రినాతో ఎంగేజ్మెంట్ అయిందట కదా అందరికీ స్వీట్స్ తినిపించాలని నాన్న కామెడీ చేశాడని వివరించాడు. దీనికి రిప్లై ఇచ్చిన విక్కీ.. నిశ్చితార్థం అనేది ఊహ కాబట్టి స్వీట్స్ తినడం కూడా ఇమాజిన్ చేసుకోమని చెప్పాడని తెలిపాడు. మొత్తానికి ఇలాంటి ఫేక్ న్యూస్ ఎలా వచ్చిందో తెలియదు కానీ మేము మాత్రం చాలా నవ్వుకున్నామని చెప్పాడు సన్నీ కౌశల్.

Advertisement

Next Story