‘పుష్ప’కు విలన్‌గా మారిన సునిల్?

by Jakkula Samataha |
‘పుష్ప’కు విలన్‌గా మారిన సునిల్?
X

దిశ, సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత వస్తున్న మూవీ ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింట్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. మాస్ మహారాజ రవితేజ ‘డిస్కో రాజా’, సుహాస్ ‘కలర్ ఫొటో’ సినిమాల్లో విలన్ రోల్‌లో మెప్పించిన కమెడియన్ సునిల్.. ‘పుష్ప’లోనూ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

ఇక కమెడియన్‌‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్‌లోనే హీరోగా పలు సినిమాల్లో నటించిన సునిల్.. వర్కవుట్ కాకపోవడంతో మళ్లీ చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నెగెటివ్ రోల్స్ కూడా ప్లే చేస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కాగా ‘పుష్ప’ సినిమాలో సునిల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఈ పాత్ర తనకు టర్నింగ్ పాయింట్‌ అవుతుందని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో బన్ని లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, రష్మిక మందన చిత్తూరు జిల్లాకు చెందిన గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది.

Advertisement

Next Story