- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సునీల్ గావస్కర్ ఒక చెత్త బ్యాట్స్‌మన్ : కిరణ్ మోరే
దిశ, స్పోర్ట్స్: భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ నెట్ ప్రాక్టీస్ విషయంలో ఒక చెత్త బ్యాట్స్‌మన్ అని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే వ్యాఖ్యానించారు. భారత క్రికెటర్లలో 10వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్, 34 సెంచరీలు నమోదు చేసిన ఈ లిటిల్ మాస్టర్ విషయంలో మోరే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, తాను ఎందుకు అలా అన్నాడో మోరే వివరణ ఇచ్చాడు. ‘నెట్స్‌లో నేను చూసిన ఆటగాళ్లందరిలో చాలా చెత్త ఆటగాడు గవాస్కర్. అతను ఎప్పుడూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు. మరుసటి రోజు టెస్ట్ మ్యాచ్లో తన ఆటతో 99.9శాతం భిన్నంగా ఉంటాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయకుండా ఎలా స్కోర్ చేయగలుగుతాడని అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ, ఒకసారి మైదానంలోకి దిగితే అతను సీరియస్‌గా బ్యాటింగ్ చేసేవాడు ‘ అని మోరే అన్నాడు. గావస్కర్ డకౌట్ అయినా లేదా 5, 10 పరుగుల వద్ద ఔటైనా పెద్దగా బాధపడేవాడు కాదు. కానీ, ఒక గంట, గంటన్నర ఆడి 40 పరుగుల దగ్గర ఔటైతే మాత్రం తీవ్ర అసహనానికి గురయ్యేవాడని మోరే చెప్పాడు. అంతసేపు క్రీజులో ఉండి కుదురుకున్న తర్వాత కూడా భారీ స్కోర్ చేయకుండా ఎందుకు అవుటయ్యా అంటూ డ్రెస్సింగ్ రూంలో గ్లవుస్ విసిరి పారేసేవాడని మోరే చెప్పాడు.