రోహిత్ శర్మ‌పై సునీల్ గవాస్కర్ ఫైర్

by Shyam |
రోహిత్ శర్మ‌పై సునీల్ గవాస్కర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసి రెండో రోజు ఆట ముగించింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ(44) మంచి ఓపెనింగ్ ఇచ్చినా.. శుబ్‌మన్‌ గిల్‌(7) నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా, రహానే మెల్లగా రాణిస్తూ, ఈరోజు ఆట ముగించారు. అయితే ఇవాల్టి మ్యాచ్‌లో వైస్ కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆటపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ పూర్తి బాధ్యరాహిత్యంగా ఆడాడని, ఫీల్డర్లను దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ చేయాలన్న కనీస ఆలోచన కూడా లేకుండా ప్రదర్శన చేశాడని మండిపడ్డారు. ఈ మ్యాచ్‌లో గవాస్కర్ ‘చానెల్‌ 7 క్రికెట్‌’ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రోహిత్ అవుట్ కాగానే గవాస్కర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్‌కు బాధ్యత లేకుండా ఆడాడని, లాంగాన్‌లో, స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డర్లు ఉన్నప్పుడు అలాంటి షాట్‌ ఆడాలని ఎలా అనుకుంటావంటూ రోహిత్‌ ఆటను విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed