- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒత్తిడితో ఆటను వదిలేద్దామనుకున్నా : సునిల్ ఛెత్రి
‘ఆటలో ఎదురైన ఒత్తిళ్లతో.. ఒకానొక సమయంలో అన్నీ వదిలేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని’ టీమ్ ఇండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునిల్ ఛెత్రి అన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్ని ఆటలకు బ్రేక్ పడటంతో ఇంటి వద్దనే ఉంటున్న సునిల్ ఛెత్రి తన కెరీర్ గురించిన పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘తన కెరీర్ ఆరంభంలో కోల్‌కతాకు చెందిన మేటి క్లబ్ మోహన్ బగాన్ తరపున ఆడేవాడినని.. అప్పట్లో ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేసేవాడినని’ చెప్పుకొచ్చాడు. కాగా, తనకు కుటుంబ సభ్యులు ఇచ్చిన తోడ్పాటు, ధైర్యంతోనే ఆ తర్వాత నెగ్గుకురాగలిగానని చెప్పాడు.
మొదటి ఏడాదిని ఎలాగోలా నెట్టుకొచ్చినా.. ఏడాది గడిచేలోపు అందరూ తనను దిగ్గజ క్రీడాకారుడు బైచుంగ్ భూటియాతో పోల్చడంతో అంచనాలు అందుకోలేక తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడినని తెలిపాడు. అంతేకాదు గోల్స్ చేసినప్పుడు అభిమానించిన వాళ్లే.. వాళ్ల అంచనాలను అందుకోలేని సమయంలో తీవ్ర విమర్శలు చేశారని అన్నాడు. దీంతో ‘నాన్న దగ్గరకు వెళ్లి.. ఇక నేను ఫుట్ బాల్ ఆడలేను.. వదిలేస్తానన్నాను. అయితే మా తల్లిదండ్రులు కూడా క్రీడాకారులే కావడంతో ఆటలో ఉండే ఒత్తిడి గురించి కూలంకషంగా వివరించారని.. ఆ తర్వాత ఒత్తిడిని జయించి పూర్తిగా ఆటపై దృష్టిపెట్టానని’ ఛెత్రి చెప్పాడు. కాగా, సునిల్ ఛెత్రి తన 18 ఏండ్ల కెరియర్‌లో ఇండియా తరపున 72 గోల్స్ చేసి రికార్డు సృష్టించాడు.
Tags : Football, Captain Sunil Chhetri, Corona, Goals, Mohun Bagan