- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సునీల్ ఛేత్రి… నెట్‌ఫ్లిక్స్… లాభపడ్డ అభిమాని!
దిశ, వెబ్‌డెస్క్: అనుకోకుండా లాభపడటంలో వచ్చే మజానే వేరు. అలాంటి అనుభూతే ఓ ఫుట్‌బాల్ అభిమానికి కలిగింది. ఇందుకోసం అతను కష్టపడ్డది ఏం లేదు. జస్ట్.. తన అభిమాన ఆటగాడికి మెసెంజర్‌లో మెసేజ్ పెట్టడమే!.. అలా ఎలా అని సందేహిస్తున్నారా? అయితే చదవండి.
లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి క్రీడలు లేవు. దీంతో అభిమానులకు బోర్ కొడుతుంది. అలా బోర్ కొట్టిన ఒక అభిమాని, భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రికి ఒక మెసేజ్ పంపించాడు. “అన్నా.. లాక్‌డౌన్ అయిపోయినంత వరకు నీ నెట్‌ఫిక్స్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ చెప్పవా” అని అడిగాడు. ఆ ఫ్యాన్ పేరు కనిపించకుండా ఈ మెసేజ్ స్క్రీన్ షాట్ ఛేత్రి ట్వీట్ చేశాడు. జెర్సీలు కాదు, ఆటోగ్రాఫ్‌లు కాదు, డైరెక్టుగా కావాల్సింది అడిగేశాడు అంటూ పోస్ట్ చేశాడు. ఆయనకు దాదాపు పది లక్షల మంది ఫాలోవర్లు ఉండటంతో ఈ ట్వీట్ వైరల్ అయింది.
ఆ ట్వీట్ చూసిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా వారు, అదే చేత్తో తమకు కూడా ఒక ఆటోగ్రాఫ్ చేసిన పిక్చర్ పంపించాలని ఛేత్రిని అడిగారు. దానికి ఛేత్రి ఇచ్చిన రిప్లైతో అభిమాని లాభపడ్డాడు. “ఆ అబ్బాయికి రెండు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఇస్తా అంటే మీకొక సంతకం చేసిన జెర్సీ, పిక్చర్ కూడా పంపిస్తాను” అని ఛేత్రి చెప్పాడు. ఇంకేం నెట్‌ఫ్లిక్స్ ఇండియా అందుకు అంగీకరించింది. కేవలం సబ్‌స్క్రిప్షన్ కార్డు మాత్రమే కాకుండా జెర్సీ కూడా ఆ అభిమానికి పంపిస్తానని ఒప్పుకుంది. ఈ చర్చ మొత్తం చూసిన కొందరు అభిమానులు సునీల్ చేసిన పనిని మెచ్చుకుంటుంటే, తమకు ఈ అవకాశం ఎందుకు రాలేదా అని మరికొందరు అభిమానులు అసూయ పడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఏదేమైనా అటు సునీల్, ఇటు నెట్‌ఫ్లిక్స్ చర్చ కారణంగా ఆ పేరు తెలియని అభిమాని లాభపడ్డాడు.
Tags – sports, sunil chhetri, fans, netflix, india, password,