- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పేరు చెప్పి ఫైనాన్స్ పొందుతున్నారు : నిర్మాతపై హీరో ఫిర్యాదు
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఓ ప్రొడక్షన్ హౌస్‌పై ఫిర్యాదు చేశాడు. బాలాజీ మీడియా ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, తన అనుమతి లేకుండానే సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నట్లు మూవీకి సంబంధించిన ఓ ఫేక్ పోస్టర్ షేర్ చేస్తోందని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశాడు. ‘అసలు ఇది ఎవరి సినిమానో తెలియదు. మేకర్స్ ఎవరో కూడా తెలియదు. నేను సినిమాకు సైన్ కూడా చేయలేదు. ఇలా ఒక ఆర్టిస్ట్‌ను బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. నా పేరును ఉపయోగించి సినిమాకు ఫైనాన్స్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది నా ప్రతిష్టను నాశనం చేస్తోంది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ట్వీట్ కూడా చేసిన సునీల్ శెట్టి.. ఈ ఎక్స్‌పీరియన్స్ పోస్టర్ల ద్వారా యువకులను ఎలా మోసం చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చిందని, ఇప్పుడు మరింత ఆందోళన చెందుతున్నానని తెలిపారు. తన ఫొటో ద్వారా ఆర్థిక దోపిడి జరుగుతుందనే కంటే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న యువకుల ప్రతిభను ఎలా దోచుకుంటున్నారనే విషయాన్ని తలచుకుంటే బాధగా ఉందన్నారు.
అయితే ఇదంతా ఓ మిస్టేక్ అని తెలిపిన సదరు ప్రొడక్షన్ కంపెనీ.. ఈ పోస్టర్ల ద్వారా తాము ఎవరి నుంచి డబ్బు ఆశించడం లేదన్నారు. సునీల్ శెట్టి, బాబీ డియోల్ లాంటి స్టార్లతో రెండు సినిమాలు ప్లాన్ చేసుకున్నామని, ఈ క్రమంలోనే వారి ఫొటోలు యూజ్ చేస్తూ తమ సినిమాలో క్యారెక్టర్‌కు తగినట్లుగా పోస్టర్లు రెడీ చేశామన్నారు. కానీ ఈ పోస్టర్లను ఎవరో సోషల్ మీడియాలో లీక్ చేశారని వివరణ ఇచ్చింది. ఆ తర్వాత పోస్టర్లను డిలీట్ చేశారని.. కానీ అప్పటికే పోస్టర్లు వైరల్ అయిపోయాయని ప్రొడక్షన్ హౌస్ వివరణ ఇచ్చింది.