- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సండే స్పెషల్ : నోరూరించే చికెన్ పాప్‌కార్న్
దిశ, వెబ్‌డెస్క్ : ఆదివారం వచ్చిందంటే ఇంటిళ్లుపాది ఇంట్లోనే ఉంటాం. ఈ కరోనా టైంలో బయటకు వెళ్లం కూడా. వీకెంట్ కాబట్టి ఇంట్లోనే మంచి రుచికరమైన వంట చేసుకుని తినాలనిపిస్తుంది. హోటల్ ఫుడ్ ఎంత బాగున్నా.. ఇంటి వంట రుచే వేరు కదా. సాధారణంగా సండే అంటే ఎక్కువ మంది నాన్ వెజ్‌కే ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి వారికి ఈ ఆదివారం ఓ స్పెషల్ వంటకాన్ని పరిచయం చేద్దాం.
సాధారణంగా పాప్‌కార్నా అంటే చిన్నలు, పెద్దలు ఇష్టపడుదారు. ఈ పాప్‌కార్నాను కేవలం మొక్కజొన్నతో కాకుండా చికెన్‌తో కూడా చేసుకోవచ్చు. చికెన్ పాప్‌కార్న్ ఎలా తయారు చేయాలో మీకు తెలియదా? అయితే నోరూరించే చికెన్ పాప్‌కార్న్ ఎలా తయారు చేయాలో మేము మీకోసం అందిస్తున్నాం చూడండి.
కావల్సినవి పదార్థాలు
250 గ్రాముల బోన్‌లెస్ చికెన్
2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్
1 టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, జీలకర్ర పొడి, గరం మసాలా, పాలు
1/2 కప్పు మైదా
1 గుడ్డు
4 బ్రెడ్
ఉప్పు రుచికి సరిపడా
చికెన్ పాప్‌కార్న్ తయారుచేయు విధానం ఇలా..
చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కడిగిన చికెన్ ముక్కలకు వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు వేసి 20 నిమిషాలు నానబెట్టాలి. ఈలోపు బ్రెడ్ ముక్కలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చాలి. దానిని మిక్సీలో పౌడర్‌గా మార్చాలి. తరువాత బ్రెడ్ పౌడర్‌కు జీలకర్ర, గరం మసాలాను కలపండి. తరువాత ఒక గిన్నెలో గుడ్డు పగలగొట్టి దానికి పాలు పోసి బాగా కలపండి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి తగినంత నూనె పోసి వేయించి వేడి చేసుకోవాలి. తరువాత చికెన్ ముక్కలు విడివిడిగా తీసుకొని గుడ్డు మిశ్రమంలో డిప్ చేయాలి. తరువాత పిండిలో వేసి అన్ని వైపులా అంటుకునే విధంగా పొర్లించాలి. తరువాత మళ్లీ గుడ్డులో డిప్ చేయాలి. చివరకు బ్రెడ్ ముక్కల్లో అద్ది కాగుతున్న నూనెలో వేయాలి. చికెన్ అంతా బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంట మీద వేయించాలి. అంతే క్రంచీ చికెన్ పాప్‌కార్న్ రెడీ. ఇంటిళ్లిపాది సాయంత్రం టైంలో స్నాక్స్‌గా ఆరగించవచ్చు. ఈ కరోనా సమయంలో చికెన్ పాప్‌కార్న్ హెల్దీ ఫుడ్ కూడా. ఇంకెందుకు ఆలస్యం.. చికెన్ పాప్‌కార్న్ చేయండిక.