04-04-2021 పంచాంగం.. రాశి ఫలాలు

by Anukaran |
Panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి: సప్తమి ఉ 9.17 తదుపరి అష్టమి
వారం: ఆదివారం (భానువాసరే)
నక్షత్రం: మూల ఉ 7.30 తదుపరి పూర్వాషాఢ
యోగం: పరిఘము రా 11.07 తదుపరి శివం
కరణం: బవ ఉ 9.17 తదుపరి బాలువ రా 8.22 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం: ఉ 7.30వరకు &
సా 4.39 – 6.11
దుర్ముహూర్తం : సా 4.32 – 5.21
అమృతకాలం: రా 1.48 – 3.20
రాహుకాలం : సా 4.30 – 6.00
యమగండం/కేతుకాలం: మ 12.00 – 1.30
సూర్యరాశి: మీనం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.58
సూర్యాస్తమయం: 6.09

రాశి ఫలాలు

మేషం:

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి అన్ని వర్గాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

వృషభం:

నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు.

మిధునం

వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలుకలుగుతాయి. కుటుంబమున అదనపుబాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున స్థానచలనాలు తప్పవు.

కర్కాటకం

ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

సింహం

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. శుభ కార్యములకు ధన వ్యయం చేస్తారు. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలుఅందుతాయి. వ్యాపారాలులాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున చిక్కులు తొలగుతాయి ఊరట చెందుతారు.

కన్య

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఇంట బయట శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి.

తుల

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారముననూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి గృహమున కొన్ని వ్యవహారాలలో శిరోభాధలు కలుగుతాయి నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

ధనస్సు

గృహమున బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు నిరుద్యోగులకు శుభవార్త అందుతాయి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం

పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తులు నుంచి సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

కుంభం

కుటుంబ సభ్యులతో చిన్నపాటి సమస్యలు. ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుండి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు ఉంటాయి

మీనం

ముఖ్య పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి.

Advertisement

Next Story