- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎంఎస్ స్కాంలో నలుగురికి సమన్లు
దిశ, క్రైమ్ బ్యూరో: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ స్కాంలో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నలుగురికి సమన్లు జారీ చేసింది. ఐఎంఎస్‌లో మందుల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, పీఎస్ ముకుందారెడ్డి, మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు ముకుందరెడ్డి బంధువు వినయ్ రెడ్డిలకు సమన్లు జారీ చేసింది. మందుల కుంభకోణం ద్వారా నిధులను భారీగా మళ్లించినట్టుగా ఈడీ గుర్తించింది. ఈ డబ్బును కొన్ని సెల్ కంపెనీలు ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించినట్టుగా గుర్తించారు. పీఎస్ ముకుందరెడ్డి తన బంధువు వినయ్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి పేర్లపై వ్యాపారాలు చేసినట్టుగా తెలుస్తోంది. దేవికారాణి తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ నిర్ధారించింది. పీఎంజే జువెల్లరీలో పెద్ద మొత్తంలో నగలు కొనుగోలు చేసినట్టు తేల్చారు. ఈ లావాదేవీలన్నీ హవాలా ద్వారా చెల్లింపులు జరిగినట్టుగా కనుగొన్నారు.