- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘చలి’ ఎండ్‌లో చాలా ఎండ
ఎండకాలం ప్రజలను పలకరించింది. ఇన్నిరోజులపాటు చలి గుప్పిట్లో మగ్గిన జనాలకు ఎండ రుచి చూపిస్తోంది. శివరాత్రి ముందు శివ శివ అంటోన్న చలి ఎండకు స్వాగతం పలికి వెళ్లిపోవడంతో గత ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగి జనాలకు ఉక్కపోతలు షురూ అయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో చలిగాలులు వీస్తున్నా ఉదయం 10 అయ్యే సరికి భానుడు భగభగ మంటున్నాడు. దీంతో ఇన్నిరోజులపాటు చలి ప్రభావంతో వేడి నీళ్లతో స్నానాలు చేసిన జనాలు ఇప్పుడు నార్మల్ వాటర్‌కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కరెంట్ పోతే ఉక్కపోత, బయటకు వెళ్తే ఎండలు దంచికొడుతుండటంతో జనాలకు చిర్రెత్తిపోతుంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ముసలివాళ్లు ఎండ ప్రభావం తట్టుకోలేక చెట్ల కిందకు చేరుతుంటే.. పట్టణ ప్రాంతాల్లో ఏసీలు, కూలర్ల కోసం షాపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. షాపుల వాళ్లు అప్పుడే ధరలు పెంచేశారు. ఈ ఏడాది ఎండలు భారీగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరించడంతో ప్రజల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది.
చిన్నపిల్లల విషయంలో కేర్ కంపల్సరీ!
రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగి మే నెల వచ్చేసరికి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేసవికాలంలో పెద్దలు పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వీలైనంత వరకు ఎండలో తిరగకుండా చూడాలి. ఎండదెబ్బ తగిలితే ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలు చెప్పి సూచనలు చేయాలి. ఎక్కువగా పండ్లు, లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఉదయం లేదా సాయంత్రం కొబ్బరినీళ్లు తాగించాలి. వీటన్నింటికి తోడు భోజన సమయంలో మజ్జిగ ఉండేలా చూసుకోవాలి. వాటర్ ఎక్కువ తాపిస్తూ కాటన్ బట్టలకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
* ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు డ్యూటీకి వెళ్లే సమయంలో ఖచ్చితంగా టిఫిన్ చేసి వెళ్తే మంచింది. ఖాళీ కడుపుతో వెళ్తే ఎండకు కళ్లు తిరిగి కిందపడిపోయే అవకాశాలు ఉంటాయి.
* బైక్‌పై వెళ్లేవారు హెల్మెట్ కచ్చితంగా ధరించాలి. ఎండ పెరగక ముందే ఆఫీసులకు చేరుకోవాలి.
* కనీసం 30 నిమిషాల కోసారైనా వాటర్ తాగుతూ ఉండాలి, ఫ్రూట్ సాలాడ్‌కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
* దూర ప్రయాణాలు చేసేవారు బస్సుల్లో వెళ్తేనే సేఫ్. ఎందుకంటే ఎండ వేడిమి ఎక్కువగా తగలదు. ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి.
* దూరపు ప్రయాణాలు చేసే సమయంలో చెవిలో కాటన్ పెట్టుకుంటే వడగాలి తోలకుండా ఉంటుంది.
* ఎక్కువగా చల్లని వాటర్ కూడా తాగొద్దు, ఫ్రిజ్ వాటర్ కంటే మట్టితో చేసిన కుండలో వాటర్ తాగితేనే బెటర్
* కూల్ డ్రింక్స్‌ను అస్సలు తాగకుండా ఉండాలి.
* కూలీలు ఉదయమే పనులకు వెళ్లి ఎండ వేడి పెరగక ముందే ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
* వేపుడు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి, రోజులో ఒక్కసారైనా అన్నంలో మజ్జిగా ఉండేలా చూసుకోవాలి.
* ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, చికెన్, మాంసానికి దూరంగా ఉంటేనే బెటర్.
* ఉదయం లేవగానే నోరు పుక్కిలించాక రెండు మూడు గ్లాస్‌ల వాటర్ తీసుకోవాలి.
* సబ్జా గింజలు ఒంట్లోంచి నీరు ఆవిరి కాకుండా చూస్తాయి కాబట్టి వీటితో పానీయాలు చేసుకొని తినొచ్చు.
* పండ్లు, జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాలి. ఐస్ క్రీమ్‌లను తినకపోవడమే బెటర్.