ఏపీలో జూన్ 11 వరకు వేసవి సెలవులు

by srinivas |
ఏపీలో జూన్ 11 వరకు వేసవి సెలవులు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 22 నుంచి పాఠశాలలన్నిటినీ మూసి ఉంచిన సంగతి తెలిసిందే.

కరోనా కట్టడికి మరింత సమయం కావాలంటూ కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు లాక్‌డౌన్ కాలపరిమితిని పెంచారు. మే 17 వరకు తాజాగా పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం జూన్‌ 11 వరకు వేసవి సెలవులిస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది.

సెలవులు ప్రకటించిన విద్యాశాఖ… స్కూళ్ల రీఓపెన్ గురించి మాత్రం స్పష్టతనివ్వలేదు. కోవిడ్‌–19 పరిస్థితిని అంచనావేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్ల రీఓపెనింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.

Tags: andhra pradesh, education department, lockdown, summer holidays

Advertisement

Next Story