- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే దారుణం..
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. వేటపాలెం మండలం కొత్తపేటలో నాగేంద్రబాబు అనే యువకుడు గ్రామ వలంటీర్‌గా చేస్తున్నాడు. అదే సచివాలయంలో ఓ మహిళా పోలీస్.. విధులు నిర్వహిస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు.
వీరి ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు నాగేంద్ర బాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ క్రమంలో వివాదం కాస్తా ముదిరింది. తీవ్ర మనస్తాపానికి గురైన నాగేంద్ర బాబు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story