- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాంకుల్లో కార్పొరేట్ల ఎంట్రీ ఆర్‌బీఐ నిర్ణయం కాదు'!
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ కంపెనీలను అనుమతించడంపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిర్ణయం కాదనీ, కేంద్ర బ్యాంకు అంతర్గత కమిటీ ఇచ్చిన సూచన మాత్రమేనని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్లను అనుమతించడంపై నిపుణులతో పాటు ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.
గత నెల కొత్తగా బ్యాంకుల ఏర్పాటుకు కార్పొరేట్ కంపెనీలకు అనుమతివ్వాలని ఆర్‌బీఐ అంతర్గత కమిటీ సూచించింది. దీంతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మూలధనంతో పాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను బ్యాంకులుగా మార్చడం, బ్యాంకింగ్ చట్టంలో మార్పులను సూచించింది. కాగా, కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి పై పలువురు ఆర్థికవేత్తలతో పాటు ప్రజల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
ఈ సూచనను అమలు చేస్తే బ్యాంకింగ్ రంగంపై బాంబు వేసినట్టేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంపై స్పందించిన దాస్..ఇది ఆర్‌బీఐ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు తప్పితే అది తుది నిర్ణయం కాదని, కమిటీ సూచన గురించి సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోకున్నట్టు దాస్ వెల్లడించారు.