- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకస్మిక తనిఖీలు.. వరుణ్ ఆస్పత్రికి షోకాజ్ నోటీసులు
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ఇబ్రహీంపట్నంలోని వరుణ్ ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగజ్యోతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నారంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ వరుణ్ ఆస్పత్రిలో కొవిడ్ రోగుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని, దీంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. వరుణ్ ఆస్పత్రి ఎండీ రవీందర్‌రెడ్డి తాళాలు వేసి వెళ్లిపోవడంతో బిల్లులు పరిశీలించలేకపోయామన్నారు.
రెండుమూడు రోజుల్లో కరోనా రోగుల వద్ద వసూలు చేసిన బిల్లులు, ఇతరత్రా వివరాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో ఆస్పత్రి నడుపుతున్నారని, త్వరగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ తెచ్చుకోకపోతే ఆస్పత్రిని సీజ్ చేస్తామని తెలిపారు. ఆస్పత్రికి పార్కింగ్, ఫైర్‌లాంటి సౌకర్యాలు కూడా లేవని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, వారి నిర్ణయం అనంతరం ఆస్పత్రిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.