కాజీపేటలో రైల్వే జనరల్ మేనేజర్ ఆకస్మిక తనిఖీలు.. ఏం పరిశీలించారంటే ?

by Shyam |   ( Updated:2021-08-19 02:16:18.0  )
కాజీపేటలో రైల్వే జనరల్ మేనేజర్ ఆకస్మిక తనిఖీలు.. ఏం పరిశీలించారంటే ?
X

దిశ, కాజీపేట: రైల్వే శాఖపరమైన తనిఖీల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానంద్ మాల్యా గురువారం కాజీపేట జంక్షన్ పరిధిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుండి ఉదయం ప్రత్యేక రైల్లో బయలుదేరిన జనరల్ మేనేజర్ బృందం కాజీపేటలోని పెట్ లైన్ వద్ద ఆగి నూతనంగా నిర్మిస్తున్న పెట్ లైన్ పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే కాలనీ లోనే వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. తర్వాత రైల్వే ఆస్పత్రికి వెళ్లి పలు విభాగాలను తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్ వెళ్లి ఉద్యోగుల పనితీరును సమీక్షించారు. జనరల్ మేనేజర్ వచ్చిన సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు స్థానిక రాజకీయ నాయకులు ఖాజీపేట సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులతో పాటు స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story