91 శాతం బకాయిలు చెల్లించిన ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర

by Harish |
subhash-chandra 1
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర తనకున్న మొత్తం రుణంలో 91.2 శాతాన్ని తీర్చేసినట్టు మంగళవారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ మొత్తం 43 మందికి చెల్లించానని, మిగిలిన బకాయిలను చెల్లించే ప్రక్రియలో ఉన్నట్టు ఆయన తెలిపారు. 110 మందిలో 43 మందికి చెందిన 91.2 శాతాన్ని చెల్లించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని నుంచి బయటపడ్డాము. ప్రస్తుతానికి 88.3 శాతం పూర్తిగా చెల్లించగా, మిగిలిన 2.9 శాతం చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక, మిగిలిన మొత్తంలో 8.8 శాతం అప్పును తీర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వ్యాపారంలో యాజమాన్యం నుంచి విడిపోయినందుకు ఎలాంటి విచారం లేదని, కుటుంబ గౌరవం కోసం ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. అలాగే, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవలు, ప్రింట్ మీడియా, మరికొన్ని వ్యాపారాల నుంచి నిష్క్రమించడం లేదా విక్రయించినట్టు తెలిపారు. మా గ్రూప్ కంపెనీలైన జీ లెర్న్ లిమిటెడ్, సిటీ నెట్‌వర్క్, జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ మూలధనం లేకపోవడం వల్ల క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మిగిలిన బకాయిలను తీర్చేయాలని భావిస్తున్నట్టు సుభాష్ చంద్ర వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed