వృద్ధుడికి సబ్ రిజిస్ట్రార్ చేయూత..

by Shyam |
వృద్ధుడికి సబ్ రిజిస్ట్రార్ చేయూత..
X

దిశ, ములుగు: వర్షంలో‌‌ తడిసి, చలికి వణుకుతున్న వృద్ధుడికి ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ దుప్పటి కప్పి, ఆహారం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని హన్మకొండ వెళుతుండగా పందికుంట బస్టాండ్‌లో వర్షానికి తడిసి, చలికి వణుకుతూ, ఆకలికి అలమటిస్తున్న వృద్ధుడు ఆమె కంటపడ్డాడు.

అతడి దీనావస్థను చూసిన అధికారిణి తస్లీమా చలించి పోయారు. లాక్‌డౌన్ కారణంగా షాపులు మూసి ఉండటంతో తస్లీమా స్వగ్రామమైన రామచంద్రపూర్‌కు తానే స్వయంగా వెళ్లి సన్నిహితుల ఇంటి వద్ద నుంచి దుప్పటి, పండ్లు, భోజనం తీసుకువచ్చి వృద్ధుడికి అందజేశారు. తోటివారి పట్ల మానవత్వం చాటుకున్న అమెను స్థానికులు అభినందించారు.

Advertisement

Next Story