- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ హిస్టరీ గ్రూప్ -2 స్పెషల్: ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర
ఉస్మానియా యూనివర్సిటీ:
భారతీయ భాషను భోదనా భాషగా మొదటి సారి ప్రవేశ పెట్టింది -ఓయూ
ఓయూలో ఉర్ధూ బోధనా భాషగా, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్‌గా ఉండేది.
1949లో ఓయూ భోధన భాషను ఉర్దూ నుండి ఇంగ్లీషులోకి మార్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ ముల్కీలలో ఉన్నత విద్యా వ్యాప్తికి దోహదపడింది.
స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
ఓయూ విద్యా వంతులైన పౌరులను తయారు చేసే సంస్థగా మారింది.
కానీ ప్రభుత్వ అధికారులను తయారు చేయలేక పోయింది.
అదే సమయంలో నిజాం కాలేజీలో ఇంగ్లీష్ మీడియం బోధన భాష ఉండేది. ఈ కాలేజీ అధికారులను తయారు చేసే నాణ్యమైన కళాశాలగా తయారైంది.
1920తో పోల్చుకుంటే చదువుకునే వారి సంఖ్య 1935-38 నాటికి బాగా పెరిగింది.
1920 నుండి 1935 మధ్య కోటి రూపాయలకు పైగా విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.
విద్యాసంస్థల సంఖ్య 1036 నుండి 4800 లకు పెరిగింది.
విద్యావంతుల సంఖ్య 66,484 నుండి 3,64,252కు పెరిగింది.
1918 నుండి 1938 వరకు సుమారు 1100 మంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు.
లండన్‌లో ఇంజనీరింగ్ చదివి చీఫ్ ఇంజనీర్ అయినది - నవాబ్ అలీ నవాజ్ జంగ్.
1918లో చీఫ్ ఇంజనీరింగ్ బాధ్యతలు చేపట్టి నిజాంసాగర్ నిర్మించారు.
ఉర్దూ బోధన భాషగా ఉండటం వల్ల ఉద్యోగాల్లో ముస్లింల ఆధిపత్యం 1948 దాకా నిరాటంకంగా కొనసాగింది.
1947- 48 లో హైదరాబాద్ సంస్థానంలో గెజిటెడ్ అధికారులు 999, వీరిలో ముస్లిం గెజిటెడ్ అధికారులు - 754
1931 జనాభాలో అక్షరాస్యుల సంఖ్య - 3,91,317 (4.03%)
ముస్లిం జనాభాలో అక్షరాస్యుల సంఖ్య 1,58,854 (10.35%)
1939లో హిందూ జనాభా 96,99,615, ముస్లిం జనాభా 15,34,666
ఫర్మానాకు కారణాలు:
1919లో జారీ చేసిన ఫర్మానా తర్వాత కూడా అక్కడక్కడ నాన్ ముల్కీలను స్థానిక ఉద్యోగాలలో నియమించడం జరిగింది.
1920లో ఓయూ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్, 1926లో లండన్‌లో సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్సివ్ సంస్థలను స్థాపించడం.
ఓయూలో విద్యను అభ్యసించిన విద్యార్థులు విద్యను ముగించుకున్న తర్వాత ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేయగా ప్రభుత్వం నాన్‌ముల్కీలను మాత్రమే ఉద్యోగాల్లో నియమించడం.
ముల్కీ లైన విద్యార్థులకు ప్రభుత్వం పట్ల నిరసన పెరిగి మరల ముల్కీ ఉద్యమానికి దారితీసింది.
1930వ మొదటి దశకంలో పంజాబ్ ప్రాంతానికి చెందిన ఖాన్‌సాహెబ్ హైదరాబాద్‌కు వచ్చి ఉన్నత ఉద్యోగంలో చేరడం.
స్థానికుల పదోన్నతలు దెబ్బతిని మళ్లీ ముల్కీ ఉద్యమం బలంగా ప్రారంభం కావడం.
హైదరాబాద్ అసోసియేషన్:
1930లో బారిష్టర్ శ్రీ కిషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
ఈ సంస్థ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పాలన సంస్కరణలు కావాలని డిమాండ్ చేసింది.
1933 ఫర్మానా:
ముల్కీ ఉద్యమాన్ని చల్లార్చడానికి 7వ నిజాం 1933 ఫర్మానా జారీ చేశాడు.
నిజాం రాజు 1933 ఫర్మానా ద్వారా రాష్ట్ర ఉద్యోగ నియామకాల్లో సమర్థవంతమైన, విద్యా వంతులైన ముల్కీలకే ప్రాధాన్యత ఇవ్వాలని హుకుం జారీ చేశాడు.
ముల్కీలకు ఆనాటి కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి అనేక విధాలుగా మద్దతు ఇచ్చారు.
1919 ఫర్మానా, 1933 ఫర్మానాలు ముల్కీ నిర్వచనం పూర్తి స్థాయిలో ఇచ్చినవి.
- వెంకటరాజం బొడ్డుపల్లి, సీనియర్ ఫ్యాకల్టీ