జనరల్ సైన్స్ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు

by Harish |
జనరల్ సైన్స్ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
X

1. మానవుని శరీరంలో మొత్తం కండరాల సంఖ్య ఎంత?

ans. 639

2. పక్షులు, క్షీరదాల హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి?

ans. 4

3. వ్యాధుల గురించి అధ్యయనాన్ని ఏ అంటారు?

ans. పాథాలజీ

4. కనుగుడ్డు కదల్చడానికి ఉపయోగపడే కండరాల సంఖ్య ఎంత?

ans. 6

5. కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త పేరు?

ans. రాబర్ట్ బ్రౌన్

6. క్షయ వ్యాధిని నిరోధించడానికి ఉపయోగపడే టీకా?

ans. BCG

7. చనిపోయిన వారి నుండి ఎన్ని గంటల్లోగా కార్నియాను సేకరిస్తారు?

ans. 6

8. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు?

ans. జూన్ 14

9. ఆహార నాళం పొడవు ఎంత?

ans. 9 మీటర్లు

10. మెదడు అధ్యయనాన్ని ఏమంటారు?

ans. ఫ్రీనాలజీ

11. అతిపెద్ద మెదడు గల జీవి?

ans. తిమింగలం

12. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం ఏ పరీక్ష నిర్వహిస్తారు?

ans. వైడల్ టెస్ట్

13. మెదడులో అతి పెద్ద భాగం?

ans. మస్తిష్కం

14. మానవుని గర్భావధి కాలం ఎంత?

ans. 40 వారాలు

15. మూత్రపిండాలు నిమిషానికి ఎంత మూత్రాన్ని వడపోస్తాయి?

ans. 100 మి.లీ

16. మూత్రాశయంలో నిల్వ ఉండే మూత్రం ఎంత?

ans. 200-300 మి.లీ

17. భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారుచేసిన టీకా మందు?

ans. H.B.V

18. భారత్‌లో తొలిసారిగా చికెన్‌గున్యూ ఎప్పుడు కనిపించింది?

ans. 1963

19. పోలియో వ్యాక్సిన్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త?

ans. జోనాస్ సాక్

20. ప్రపంచంలో మొదటి యాంటీబయాటిక్?

ans. పెన్సిలిన్

Advertisement

Next Story