మరాఠా రాజ్యం శివాజీ (1627-80): (ఆధునిక భారతదేశ చరిత్ర)

by Harish |
మరాఠా రాజ్యం శివాజీ (1627-80): (ఆధునిక భారతదేశ చరిత్ర)
X

మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం(1775-82) :

గవర్నర్‌ జనరల్‌ - వారెన్‌ హేస్టింగ్‌

మాధవరావు మరణానంతరం నారాయణరావు పీష్వా అయ్యాడు

రఘునాథరావు నారాయణరావును వ్యతిరేకించి అతనిని హత్య చేసి తనకు తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు.

నారాయణరావు మరణానంతరం కొన్ని నెలలకు అతనికి 2వ మాధవరావు జన్మించాడు.

మరాఠా మేధావులు అయిన నానా ఫాద్నిస్‌, మహాధ్జి సింధియా మొదలగువారు 2వ మాధవరావును పీష్వాగా పేర్కొని రఘోబాపై యుద్ధం ప్రకటించారు.

దీనికి భయపడిన రఘోబా బ్రిటీష్‌ బొంబే ప్రభుత్వ సహాయమును ఆర్జిస్తూ సూరత్‌ అనే ఒప్పందంపై సంతకం చేశాడు.



కానీ ఈ ఒప్పందం గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌కు తెలియకుండా జరగడంతో అతను దీనిని తిరస్కరించి నానాఫాద్నిస్‌తో పురంధర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. (దీని ప్రకారం బ్రిటీష్‌ రఘోబాకు సహాయం చేయదు)

బ్రిటీష్‌ బోంబే ప్రభుత్వం సూరత్‌, పురంధర్‌ ఒప్పందాలను లండన్‌కు పంపింది.

బ్రిటన్‌ ప్రభుత్వం సూరత్‌ ఒప్పందాన్ని సమర్థించింది.

దీంతో బ్రిటీషు బోంబే ప్రభుత్వ సైనికులు, రఘోబా సైనికులు నానా ఫాద్నిన్‌పై దాడులు ప్రారంభించారు.

కానీ నానాఫాద్నిస్‌ తెలగామ్‌ అనే యుద్ధంలో వీరిని ఓడించి బ్రిటీష్‌ చే వడగాం అనే ఒప్పందంపై సంతకం చేయించాడు.

కానీ వారెన్‌ హేస్టింగ్స్‌ 'వడగాం' ఒప్పందమును తిరస్కరించి జనరల్‌ గుడార్డ్‌ను మరాఠాపైకి పంపాడు.

1782 నాటికి ఎవ్వరునూ గెలిచే స్థితిలో లేకపోవుటచే “సాల్బాయ్‌” అనే ఒప్పందంతో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైంది.

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధంలో జరిగిన ఒప్పందాలు:

సూరత్‌ ఒప్పందం - 1775

పురంధర్‌ - 1776

వడగాం - 1778

సాల్బాయ్‌ - 1782

సాల్బాయ్ ఒప్పందం ప్రకారం సాల్‌సెట్టి బ్రిటీష్‌ వారికి ఇవ్వబడింది. ఇది బొంబాయి దగ్గర ఉంది.

Advertisement

Next Story