భారతదేశానికి డచ్, డేన్స్, ఫ్రెంచ్‌వారి రాక: ఇండియన్ హిస్టరీ (గ్రూప్స్ స్పెషల్)

by Harish |
భారతదేశానికి డచ్, డేన్స్, ఫ్రెంచ్‌వారి రాక: ఇండియన్ హిస్టరీ (గ్రూప్స్ స్పెషల్)
X

డచ్ (నెదర్లాండ్స్‌ / హాలెండ్‌):

ప్రధాన కేంద్రం -సేరంపూర్‌ (1676)

వీరి పశ్చిమ ప్రధాన కేంద్రం - నాగపట్టణం

1690 వరకు డచ్‌వారి ప్రధాన కేంద్రం పులికాట్‌.

1602లో-డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపించబడింది. దీని అసలు పేరు VOC (Verinidge Ostinditche Companie)

డచ్ వారి స్థావరాలు :

మచిలీపట్నం - 1605

పులికాట్‌ - 1610

సూరత్ - 1616

ఇరైకల్‌ - 1645 (తమిళనాడులో)

చిన్సూరా - 1653 (బెంగాల్‌)

కోచి - 1653

నాగాపట్నం - 1658

1623లో డచ్‌ అంబోయానా (ఇండోనేషియాలో ఉంది) యుద్ధంలో బ్రిటీష్‌ వారిని ఓడించింది.

1655లో డచ్‌వారు పోర్చుగీసు నుండి శ్రీలంకను ఆక్రమించారు.

1782లో బ్రిటీష్‌ వారు శ్రీలంకను డచ్‌ నుండి పొందారు.

1759లో-చిన్సూరా లేదా బేదరా యుద్ధంలో బ్రిటీష్‌ గవర్నర్‌ రాబర్ట్‌ క్లైవ్‌ డచ్‌ వారిని ఓడించాడు.

ఈ యుద్ధం తర్వాత డచ్‌ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్లిపోయారు.

అనంతరం ఇండోనేషియాను ఆక్రమించుకొని 1949 వరకు పాలించారు.

డేనిష్‌ /డేన్స్‌ (డెన్మార్క్‌) :

1616లో డేన్స్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపించబడింది.

ప్రధాన కేంద్రం - సేరంపూర్ (1676) (పశ్చిమ బెంగాల్ )

డేన్స్‌ యొక్క ఇతర స్థావరము -(1620) ట్రాంకోబార్‌ (తమిళనాడు)

డేన్స్‌ భారతదేశంలో ఉంటూ ప్రధానంగా చైనాతో వర్తకం చేసేవారు.

భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలలో పాల్గొనేవారు.

1845లో బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ 1వ హార్టింజ్‌ డేన్స్‌ స్థావరాలైన సేరంపూర్‌, ట్రాంకోబార్‌ లను 120 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు.

దీంతో డేన్స్‌వారు భారతదేశం వదిలి వెళ్లిపోయారు.

ఫ్రెంచి వారు:

ప్రధాన కేంద్రం - పాండిచ్చేరి

1664లో ఫ్రెంచి ఈస్ట్‌ ఇండియా కంపెనీని ఫ్రెంచి రాజు 14వ లూయీ కాలంలో అతని ప్రధానమంత్రి కోల్‌బర్ట్‌ స్థాపించాడు.

దీని అసలు పేరు 'Compaignile Des Indies Orientales'

మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు నుండి 'నవాబ్‌ అనే బిరుదుపొందిన మొదటి యూరోపియన్‌ -డ్యూమాస్‌ (ఫ్రెంచ్‌)

1668 - ఫ్రెంచివారు మొట్టమొదటి స్థావరం సూరత్‌ వద్ద ఫ్రాన్సిస్‌ కారన్‌ నిర్మించాడు.

1669 - ఫ్రెంచివారి 2వ స్థావరం మచిలీపట్నం వద్ద మకారా నిర్మించాడు.

1673 - ఆర్కాట్‌ పాలకుడు షేర్‌ఖాన్‌లోడి వాలికొండపురమును ఫ్రెంచి అధికారులైన బెల్లాంజిర్‌-డీ-లెస్పినే, ఫ్రాంకోయిస్‌ మార్టీన్ ‌లకు ఇచ్చాడు.

ఫ్రెంచి మొట్టమొదటి గవర్నర్‌ అయిన ఫ్రాంకోయిస్‌ మార్చిన్‌ వాలికొండపురమును పాండిచ్చేరిగా అభివృద్ధి చేశాడు.

పాండిచ్చేరిని మొదటగా పోర్చుగీస్‌వారు 16వశతాబ్ధంలో ఆక్రమించి స్థావరాన్ని నిర్మించారు.

స్థానిక జింజీ పాలకులచే తరిమి వేయబడ్డారు. తర్వాత డచ్‌, డేన్స్‌వారు కూడా స్థావరాలు నిర్మించారు. వీరు కూడా అక్కడి నుండి బహిష్కరించబడ్డారు.

చివరకు ఫ్రెంచి ‌వారు పాండిచ్చేరిలో శాశ్వత స్థావరాన్ని నిర్మించుకోగలిగారు.

1690 - చంద్రనాగోర్‌ను షైస్తాఖాన్‌ నుండి పొందారు.

1721 - ఫ్రెంచి మారిషస్‌ను ఆక్రమించినది.

1725 - ఫ్రెంచి యానాం, మాహె, కాలికట్‌ ప్రాంతాలను పొందినది.

1739 - కరైకల్‌ను ఫ్రెంచి కంపెనీ పొందినది.

1760 - 'వందవాసి' యుద్ధంలో(కర్ణాటకలో) బ్రిటీష్ జనరల్‌ ఐర్‌కూట్‌ ఫ్రెంచి జనరల్‌ కౌంట్‌-డి-లాలీను ఓడించారు.

ఈ యుద్ధంతో ఫ్రెంచి, భారతదేశంలో పూర్తిగా తన ఆధిపత్యాన్ని కోల్పోయినది. పాండిచ్చేరికి పరిమితమైంది.

పాండిచ్చేరి అనగా 4 ప్రాంతాలు. అవి

1. పాండిచ్చేరి (తమిళనాడు)

2. కరైకల్‌ (తమిళనాడు)

3. యానం (ఆంధ్రప్రదేశ్‌)

4. మాహే (కేరళ)

Advertisement

Next Story