- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్
దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ రూపొందించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం విద్యాశాఖ కార్యాలయంలో ఈ స్టడీ మెటీరియల్‌ను ఆమె విడుదల చేశారు. డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా, పాఠ్యాంశాల్లోని కీలక భావనలను సులభంగా అర్థమయ్యేలా ఈ స్టడీ మెటీరియల్‌ను రూపొందిచామన్నారు. ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో మెటీరియల్ రూపొందించామన్నారు.
కార్పోరేట్ సంస్థలు రూపొందించే నోట్సు కన్నా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రస్తుతానికి ఈ స్టడీ మెటీరియల్ ను www.scert.telangana.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మాతృభాషలో సాంకేతిక పదాలను నేర్చుకోవడానికి బహుబాషా నిఘంటువును రూపొందించామని వెల్లడించారు.
గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సాంఘిక శాస్త్రాల్లోని సాంకేతిక పదాలను ఆంగ్లం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం బాషల్లో రూపొందించామన్నారు. ఇది ప్రాథమిక పరిభాషపై ప్రావీణ్యం పొందడం, ప్రశ్నాపత్రాల్లో ఏకరూపతను పాటించడానికి, అనువాదంలో అస్పష్టతను నివారించడానికి దోహదపడుతుందని చెప్పారు. వివిధ భాషలను నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న వారికి బహుభాషా నిఘంటువు ఉపయోగపడుతుందన్నారు. ఈ నిఘంటువు రాష్ట్ర, విద్యా పరిశోధన శిక్షణ సంస్థ చరిత్రలో మరొక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.సి. రఘోత్తమరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, సంచాలకులు రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.