- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బస్సును అడ్డగించి ధర్నా చేసిన విద్యార్థులు
దిశ, మేళ్లచెరువు: సకాలంలో బస్సులు నడపాలని విద్యార్థులు ఆర్టీసీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ స్టేజీ వద్ద విద్యార్థులు కాలేజీకి వెళ్లేందుకు గంటల తరబడి ఎదురుచూశారు. ఎంతసేపు చూసినా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు కందిబండస్టేజీ వద్ద బస్సును అడ్డగించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. సకాలంలో బస్సులు రాక రోజూ కాలేజీకి ఆలస్యంగా వెళ్తున్నామని అన్నారు. గతంలో మేళ్లచెరువు నుంచి కోదాడ పట్టణానికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు నాలుగు బస్సులు ఉండేవని, ప్రస్తుతం వాటిని ఆర్టీసీ యాజమాన్యం తగ్గించడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థుల ధర్నా స్థలికి వచ్చారు. ఆర్టీసీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చి విద్యార్థులను బస్సులో కాలేజీకి పంపారు.
- Tags
- mellacheruvu