- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్‌సీయూలో విద్యార్థుల నిరసన
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: హాస్టల్ ఖాళీ చేసి వెళ్లేది లేదంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (యూఓహెచ్) విద్యార్థులు మంగళవారం నిరసనకు దిగారు. కొవిడ్-19 నేపథ్యంలో విద్యార్థులను జూన్ 9లోపు హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లాలంటూ హెచ్‌సీయూ అడ్మినిస్ట్రేషన్ విభాగం మే30న ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు మాస్క్‌లు, భౌతికదూరం పాటిస్తూ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు భరించే శక్తి లేకపోవడంతో పాటు హోం క్వారెంటైన్ పాటించే స్థితిలో లేని కుటుంబాలు ఈ నిర్ణయంతో ఇబ్బందులు పడుతారన్నారు. ప్రయాణ సమయంలోనూ తాము కరోనా బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్క్యులర్‌ను వెనక్కి తీసుకొనే వరకూ నిరసన్ కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.
Advertisement
Next Story