మొదటిరోజు హాజరు అంతంత మాత్రమే.

by Anukaran |   ( Updated:2021-09-01 07:01:56.0  )
not-intr
X

దిశ,షాద్ నగర్: రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్1 నుంచి పాఠశాలలో ప్రత్యక్షబోధన ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ పాఠశాలలకు రావడానికి విద్యార్థులు మాత్రం ఆసక్తి కనబర్చలేదు. అసలే కరోనా మూడోవేవ్ వార్తల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపి రిస్కుచేయడానికి ఇష్టపడలేదు.

ఫరూక్ మండల పరిధిలో 98 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 9,208 మంది విద్యార్థులకు 1,905 మంది, 48 ప్రైవేటు పాఠశాలలో 13,996 మందికి 1,720 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 15% మంది విద్యార్థులు వచ్చారు. అలాగే షాద్ నగర్ పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పద్మావతి కాలనీలోని మాంటీస్సోరి పాఠశాలకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదని ఎం ఈ ఓ శంకర్ రాథోడ్ తెలిపారు. కేశంపేట మండల పరిధిలోని కాకూనూర్ ప్రభుత్వ పాఠశాలలో 52 మందికి 6 గురు విద్యార్థులు పాఠశాలకు హాజరుకావడం గమనార్హం. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 4,000 మంది విద్యార్థులు ఉండగా 849మంది హాజరైనట్లు ఇంచార్జి ఎం ఈ ఓ మనోహర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed