పెండింగ్ పరీక్షలు ఉన్నచోటి నుంచే రాయొచ్చు : కేంద్రం

by Shamantha N |

న్యూఢిల్లీ : పెండింగ్‌లో ఉన్న 10వ, 12వ తరగతి పరీక్షలను విద్యార్థులు తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రం లేదా జిల్లాలోనే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకుని రాసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా స్కూల్స్ మూసివేయడంతో విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే, త్వరలో నిర్వహించబోయే ఈ పరీక్షలను విద్యార్థులు మళ్లీ ప్రీవియస్ బోర్డు ఎగ్జామ్ సెంటర్‌లలోనే రాయాల్సిన అవసరం లేదని హెచ్‌ఆర్‌డీ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ తెలిపారు. తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రం, జిల్లాల్లోనే కొత్తగా ఎగ్జామ్ సెంటర్‌ల అభ్యర్థనల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) త్వరలోనే రిజిస్ట్రేషన్ పద్ధతిని ప్రకటిస్తుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు జూలై1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి.

Advertisement

Next Story