మంత్రి కేటీఆర్ ఇలాఖాలో నేలరాలుతున్న నిరుద్యోగులు..

by Sridhar Babu |   ( Updated:2021-11-22 12:00:15.0  )
మంత్రి కేటీఆర్ ఇలాఖాలో నేలరాలుతున్న నిరుద్యోగులు..
X

దిశ, సిరిసిల్ల : ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణం అశోక్‌నగర్‌కు చెందిన కల్లూరి వెంకటేశ్(24) బీటెక్‌ పూర్తి చేశాడు. రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. కాగా, ఎంతకూ తన అర్హతలకు తగిన ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేష్ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎల్లారెడ్డిపేట తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. ఎల్లారెడ్డిపేటకు తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యంలో వెంకటేష్ మృతి చెందాడు. చేతికందొచ్చిన కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉద్యోగం కోసం యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story